భార్యపై అత్యాచారయత్నం.. అడ్డుకున్న భర్త వేలిని కొరికి..

by Vinod kumar |   ( Updated:2022-03-18 13:16:32.0  )
భార్యపై అత్యాచారయత్నం.. అడ్డుకున్న భర్త వేలిని కొరికి..
X

దిశ, వర్థన్నపేట: వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండాపురానికి చెందిన వీఆర్ఏ గాదె అశోక్ ఓ మహిళపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. బాధిత మహిళ భర్త అడ్డు పడటానికి ప్రయత్నిస్తున్న క్రమంలో వీఆర్ఏ అతని ఎడమ చేయి చిటికెన వేలును కొరికి.. చిదిమేసిన ఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది.


ఎస్సై బండారి రాజు తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని కొండాపురం శివారు తండాకు చెందిన బాధిత కుటుంబ సభ్యులు బిర్యాని సెంటర్ నిర్వహించుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు‌. గురువారం రాత్రి కొండాపురం గ్రామానికి చెందిన వీఆర్ఏ గాదె అశోక్ బిర్యాని సెంటర్ నిర్వాహకుడి భార్యపై అత్యాచారయత్నానికి ప్రయత్నించగా, ఆమె భయాందోళనకు గురై కేకలు వేయడంతో.. భర్త, కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.


ఈ క్రమంలో బాధిత మహిళ భర్త ఎడమ చేయి చిటికెన వ్రేలు నిందితుడి నోట్లో పడటంతో.. కోరికి చేయి నుండి వ్రేలును వేరు చేశాడు. వెంటనే బాధిత కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని హాస్పిటల్ కు తరలించారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story