- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Volkswagen Polo: 'లెజెండ్ ఎడిషన్' ను విడుదల చేసిన వోక్స్‌వ్యాగన్!
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ భారత్‌లో తన హ్యాచ్‌బ్యాక్ మోడల్ పోలోను ప్రవేశపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను సోమవారం విడుదల చేసింది. దీని ధరను రూ. 10.25 లక్షలుగా నిర్ణయించామని కంపెనీ తెలిపింది. మొదటిసారిగా 2009లో పోలో మోడల్ ఉత్పత్తిని ప్రారంభించామని, 2010లో మార్కెట్లోకి తెచ్చినట్టు కంపెనీ పేర్కొంది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ మోడల్ 3 లక్షల యూనిట్లను కంపెనీ విక్రయించింది. 'భారత మార్కెట్లో వోక్స్‌వ్యాగన్ పోలో మోడల్‌కు వినియోగదారుల నుంచి మెరుగైన ఆదరణ లభించింది. ఇప్పటికీ తమ పోర్ట్‌ఫోలియోలో ఈ మోడల్‌కు మంచి ఆదరణ ఉందని, ఈ క్రమంలో పోలో కారును తీసుకొచ్చి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'లెజెండ్ ఎడిషన్' పేరుతో దీన్ని భారత వినియోగదారులకు అందిస్తున్నామని ' వోక్స్‌వ్యాగన్ ఇండియా ప్యాసింజర్ కార్స్ బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. పోలో లెజెండ్ ఎడిషన్ జీటీ టీఎస్ఐ వేరియంట్‌లో అందుబాటులొ ఉంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటెడ్ ట్రాన్స్‌మిషన్‌తో 1-లీటర్ ఇంజిన్‌తో వస్తుంది. ప్రత్యేకంగా తెచ్చిన ఈ వేరియంట్ సైడ్ బాడీ గ్రాఫిక్స్, బ్లాక్ ట్రంక్ గార్నిష్, బ్లాక్ రూఫ్ ఫాయిల్‌తో లభిస్తోంది. ఈ కారు వోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉందని కంపెనీ వెల్లడించింది