- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vodafone - Idea సరి కొత్త రీచార్జ్ ప్లాన్‌లు!
దిశ, వెబ్‌డెస్క్: భారతీయ టెలికాం కంపెనీ Vi (వోడాఫోన్ ఐడియా) తన వినియోగాదారుల కోసం కొత్తగా రెండు ప్లాన్‌లను తెచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశాల ప్రకారం కొత్త ప్లాన్‌లు 30, 31 రోజుల పాటు చెల్లుబాటు అవుతాయి. రూ.107 ప్లాన్ 30 రోజులు, రూ.111 ప్లాన్ 31 రోజుల పాటు వాలిడిటీ ఉంటుంది. ఈ రెండే కాకుండా మరో రెండు కొత్త రీచార్జ్ ప్లాన్‌లు రూ. 327, రూ. 377 కూడా అందుబాటులో ఉన్నాయి.
రూ. 111 ప్లాన్
ఈ ప్లాన్ రూ. 111 టాక్‌టైమ్‌ను, 31 రోజుల సర్వీస్ వాలిడిటీని కలిగి ఉంది. సబ్‌స్క్రైబర్‌లు సెకనుకు 1 పైసాతో వాయిస్ కాల్స్ చేయవచ్చు. అదనంగా, ఈ ప్లాన్ ఉచిత అవుట్‌గోయింగ్ SMS ప్రయోజనాలతో పాటు 200MB డేటాతో అందుబాటులో ఉంటుంది.
రూ. 107 ప్లాన్
రూ. 107 ప్లాన్ రూ. 107 టాక్‌టైమ్ వాయిస్ కాల్స్‌ను 1p/సెకన్ చార్జీతో అందిస్తోంది. 200MB డేటా, 30 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఉచిత SMS లు లేవు.
రూ. 327 ప్లాన్
ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMS లు, మొత్తం 25GB డేటా లభిస్తుంది. ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. అదనంగా, వినియోగదారులు Vi Movies, TV యాప్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతారు.
రూ. 377 ప్లాన్
ప్లాన్ 31 రోజుల చెల్లుబాటుతో అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMS లు, మొత్తం 28GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ Vi Movies, TV యాప్‌కు సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది.