- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వికారాబాద్ మైనర్ బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు
దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ మైనర్ బాలిక హత్య కేసును పోలీసులు చేధించారు. అనేక మలుపులు తిరిగిన ఈ కేసును FSL, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఛేధించినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బాలిక హత్య కేసులో ప్రియుడు మహేందర్ అసలు సూత్రధారి గా నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికకు, ప్రియుడు మహేందర్ కు ఏడాది నుంచి పరిచయం, ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి ప్రేమ వ్యవహారం బాలిక చెల్లికి తెలియడంతో.. గొడవ మొదలైనట్లు తెలిపారు.
హత్యకు ముందు ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకొని.. ప్లాన్ ప్రకారం.. ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఊరి చివర్లో బాలికను మహేందర్ బలవంతం చేయబోయాడు. బాలిక నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ ..తోపులాట జరిగింది. ఈ క్రమంలో బాలిక కింద పడి తలకు దెబ్బ తగిలినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే మహేందర్ ఒక్కడే బాలికను హత్య చేసినట్లు పోలీసులు నిర్దారించి అతన్ని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు.