- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైన్స్‌లో విజిలెన్స్ అధికారుల తనిఖీ.. ఏమీ లేవని షాపు సీజ్
దిశ: బయ్యారం: మండల కేంద్రంలోని విజయ దుర్గ వైన్ షాపును బుధవారం విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీ చేశారు. షాపును గురువారం సీజ్ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలో మూడు వైన్ షాపులు ఉన్నా ఏ ఒక్క షాపులో నౌకర్ నామా లైసెన్సులు లేవని పలువురు ఆరోపిస్తున్నారు. గతకొన్ని రోజులుగా మండలంలోని కొంత మంది ప్రభుత్వ నిబందనలకు వ్యతిరేఖంగా మద్యాన్ని వైన్ నిర్వహకులు అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ మేరకు సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు వైన్ షాపును తనిఖీలు చేసి షాపులో ఫుల్ బాటిల్ మద్యం ఇతర బెల్టు షాపులకు, ఎంఆర్‌పికంటే క్వార్టర్ 20 రూపాయలు అదనంగా విక్రయాలు చేస్తుండటం, షాపులో ఫుల్ బాటిల్ రిజిస్టర్‌లో కంటే స్టాకు తక్కువ ఉండటం, రిజిస్టర్ సరిగా నమోదు చేయక పోవడం, ఫుల్ బాటిల్ ఇతర బెల్టు షాపులకు విక్రయాలు చేపట్టకూడదనే నిబందన, కౌంటర్‌లో నౌకర్ నామా లైసెన్స్ తీసుకోకుండా కౌంటర్ అమ్మకాలు సాగిస్తున్న విషయాలపై కేసు నమోదు చేసి సీల్ చేసినట్లు తెలిసింది. దీంతో షాపును సీజ్ చేశారు.