Varun Tej: ఫిజికల్ ఛాలెంజెడ్ ఫ్యాన్‌కు కింద కూర్చొని మరీ షేక్ హ్యాండ్ ఇచ్చిన మెగా హీరో.. (వీడియో)

by Anjali |   ( Updated:2024-11-23 12:56:52.0  )
Varun Tej: ఫిజికల్ ఛాలెంజెడ్ ఫ్యాన్‌కు కింద కూర్చొని మరీ షేక్ హ్యాండ్ ఇచ్చిన మెగా హీరో.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) ప్రస్తుతం మట్కా మూవీ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ ఇవాళ (నవంబరు12) విజయవాడ(Vijayawada)కు వెళ్లాడు. పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల(Potti Sriramulu Engineering College)కు చేరుకుని.. అక్కడ కాలేజీ విద్యార్థులతో ముచ్చటించాడు. అయితే ఈ క్రమంలోనే మెగా హీరో ఓ ఫిజికల్ ఛాలెంజెడ్ ఫ్యాన్(Physically challenged fan) ను మీట్ అయ్యాడు. ఈ హీరో వస్తున్నాడని తెలిసి ఎంతగానో ఎదురుచూసిన ఈ అభిమానితో కింద కూర్చొని మరీ కూల్‌గా మాట్లాడాడు. అంతేకాకుండా తనకు షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఫొటోలు కూడా దిగాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వైరా ఎంటర్టైన్మెంట్స్(Vaira Entertainments), SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై కరుణ్ కుమార్(Karun Kumar) దర్శకత్వంలో వస్తోన్న మట్కా(Matka) చిత్రం నవంబరు 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్‌కు జోడిగా మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) నటించింది. మునుపెన్నడు కనిపించని విధంగా వరుణ్ ఈ మూవీతో డిఫరెంట్ పాత్రతో జనాల్ని అలరించనున్నాడు. వైజాగ్(Vizag) లో ఎదిగిన ఓ డాన్ స్టోరీని సినిమా రూపంలో చూపించడమే మట్కా సినిమా. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్లు సినీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.


👉 Click Here For Tweet!

Advertisement

Next Story