- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Varun Tej Matka: సెన్సార్ పూర్తి చేసుకున్న మట్కా.. ఏ సర్టిఫికెట్ వచ్చిదంటే?
దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’ (Matka). 1958-1982 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. వరుణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ (huge budget)తో రూపొందుతున్న మట్కా సినిమా కోసం మెగా ఫ్యాన్స్ (Mega Fans)తో పాటు.. సినీ ప్రేమికులు కూడా ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ నవంబర్ (November) 14న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ (Promotional Content)తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ (High Expectations) నొలకొన్నాయి. ఈ క్రమంలోనే విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ (sensor) పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.
‘మట్కా’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకోగా.. సెన్సార్ సభ్యులు యూఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ విషయాన్ని వరుణ్ తన ఇన్‌స్టా (Insta) వేదికగా అధికారికంగా ప్రకటించాడు. కాగా.. ఈ చిత్రానికి కరణ్ కుమార్ (Karan Kumar) దర్శకత్వం వహిస్తుండగా.. వైరా ఎంటర్‌టైన్మెంట్ (Vira Entertainment), ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్ (SRT Entertainment) బ్యానర్లపై విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ కాగా.. నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోస్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, రవి శంకర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.