- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Varun Tej: నీకు సపోర్ట్ చేసిన వాళ్ళని మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన వరుణ్ తేజ్ ?
దిశ, వెబ్ డెస్క్ : వరుణ్ తేజ్( Varun Tej), మీనాక్షి(Meenakshi Chaudhary) జంటగా కలిసి నటించిన సినిమా మట్కా(Matka). కరుణకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ నవంబర్ 14న విడుదల కానుంది. ఆదివారం సాయంత్రం మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. అయితే, ఈ ఈవెంట్ లో వరుణ్ తేజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
వరుణ్ తేజ్( Varun Tej) మాట్లాడుతూ.. " సినిమా బాగుంది.. కానీ, ఎంత బాగున్నా టెన్షన్ కూడా ఉంటుంది. సినిమా గురించి లావణ్యతో మాట్లాడి పడుకున్నాను. ఉదయం చరణ్ అన్నయ్య నాకు కాల్ చేసాడు. అన్నయ్యతో మాట్లాడితే చాలు నాకు చాలా ధైర్యం వస్తుంది. నేను బాధలో ఉన్నప్పుడు అన్న సపోర్ట్ చేస్తాడు. థ్యాంక్స్ చరణ్ అన్న. మా బాబాయ్, పెదనాన్నని ఎప్పుడూ మర్చిపోను. జీవితంలో నువ్వు ఎన్నో గొప్ప విజయాలు సాధించి ఉండొచ్చు. కానీ, నువ్వు ఎక్కడ నుంచి వచ్చావన్నది మర్చిపోకూడదు. అది నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. చిరంజీవి గారు, బాబాయ్ ఎప్పుడూ నా మసన్సులో ఉంటారు" అంటూ తన మాటల్లో చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు, వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ నెట్టింట చర్చలకు దారితీస్తున్నాయి. ఈ మాటలపై మెగా ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Read More ...
Varun Tej: రామ్ చరణ్ నా భుజం మీద చెయ్యి వేస్తే చాలు.. అదే నాకు వెయ్యి కోట్లు (వీడియో)