కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన వరుణ్, లావణ్య.. ఎందుకంటే!

by Hamsa |
కొత్త ఇంటికి  షిఫ్ట్ అయిన వరుణ్, లావణ్య.. ఎందుకంటే!
X

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ప్రజెంట్ ‘మట్కా’(Matka) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నవంబర్ 14న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో స్టార్ట్ చేసిన వరుణ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక మెగా హీరో పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత ఏడాది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె సినిమాలకు దూరం అయింది. కానీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. భర్తతో, అత్తింటి వారితో కలిసి వెకేషన్స్‌(Vacations)కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఇక వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.

అయితే గత కొద్ది రోజుల నుంచి లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్(pregnant) అయినట్లు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, వరుణ్, లావణ్య ఓ కొత్త ఇంటికి షిఫ్ట్ అయినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూబ్లీ హిల్స్‌(Jubilee Hills)లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(Narasimha Rao)కి చెందిని అపార్ట్‌మెంట్‌ను నాగబాబు(Nagababu) రెంట్‌కు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీపావళి(Diwali) సందర్భంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టినట్లు వార్తలు వైరల్‌గా మారాయి. దాదాపు కోటి రూపాయల ఖర్చుతో వరుణ్ తేజ్, లావణ్య ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నారట. మెగా ఫ్యామిలీ దీపావళి(Diwali) సంబరాలు ఈ ఇంట్లోనే జరిగాయని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఇంటిని సందర్శించినట్లు టాక్.

Advertisement

Next Story