ముస్లిం యువకుడు మృతి.. యోగీ సీరియస్

by S Gopi |   ( Updated:2022-03-29 07:01:40.0  )
ముస్లిం యువకుడు మృతి.. యోగీ సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: యూపీలో ఓ యువకుడు మృతిచెందాడు. దీంతో యూపీ సర్కార్ తీవ్రంగా మండిపడింది. అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించింది. రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... మార్చి 20న ఉత్తర్ ప్రదేశ్ లోని కుషి నగర్ కథార్ ఘర్ లో బాబర్ అలి(25) అనే యువకుడిపై స్థానికులు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన బాబర్ ను ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాబర్ మృతిచెందాడు. దీంతో ఆ యువకుడి మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు హామీ ఇవ్వడంతో బాబర్ అంత్యక్రియలు నిర్వహించారు. బాబర్ బీజేపీకి వీరాభిమాని అని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసినందుకు, స్వీట్లు పంచినందుకు స్థానికులు దాడి చేశారని, వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు..సంఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మృతుడికి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. బాబర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సీఎంఓ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed