- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమిత్ షా HYD టూర్ వాయిదా.. ఏప్రిల్ 14న ప్రోగ్రామ్ లేనట్లే!
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర ప్రారంభానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యే అవకాశాలు తక్కువే. ముగింపు సభకు హాజరుకానున్నట్లు హామీ ఇచ్చారు. షెడ్యూలు ప్రకారం ఈ నెల 14న గద్వాల నుంచి బండి సంజయ్ సెకండ్ ఫేజ్ పాదయాత్ర ప్రారంభం కానున్నది. తొలుత అనుకున్న ప్రకారం అమిత్ షా హాజరై ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. కానీ, ఢిల్లీలో అమిత్ షా ను మంగళవారం బండి సంజయ్ కలిసిన తర్వాత ప్రోగ్రామ్ మారింది. వచ్చే నెలలో మహేశ్వరంలో పాదయాత్ర ముగింపు సభకు వస్తానని సంజయ్‌కు అమిత్ షా హామీ ఇచ్చారు. భారీ స్థాయిల బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభోత్సవానికి రావడంలేదు. దానికి బదులుగా పాదయాత్ర మధ్యలోనే అనుకూలమైన తేదీని చూసుకుని రానున్నట్లు స్వయంగా ఆయనకే హామీ ఇచ్చారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా వీరిద్దరితో బండి సంజయ్ వేర్వేరుగా మంగళవారం సమావేశమైన సందర్భంగా తాజా మార్పులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను కూడా వీరిద్దరికీ బండి సంజయ్ వివరించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ యూనిట్ చేస్తున్న కార్యకలాపాలను వివరించడంతో సంతృప్తి వ్యక్తం చేసి మరింత ఉధృతంగా చేయాలని నడ్డా ప్రోత్సహించారు.