- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రి ఎదుటే కూతురిపై అశ్లీల వ్యాఖ్యలు దారుణం.. కేరళ హైకోర్టు
కేరళ: తండ్రీకూతుళ్లు కలిసి రోడ్డు మీద నడుస్తున్నా సరే.. ఆ కుమార్తెపై అశ్లీల వ్యాఖ్యలు చేయడం మానని సమాజం తీరును కేరళ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎదుటే ఆయన కుమార్తెను అసభ్యంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఇదేంటని ప్రశ్నించినందుకు ఆ తండ్రినే హెల్మెట్‌తో బాది గాయపర్చడం దురదృష్టకరమని కోర్టు విచారం వ్యక్తం చేసింది. పైగా దాడి చేసిన వ్యక్తికి ముందస్తు బెయిల్ నిరాకరించింది. వివరాల్లోకి వెళితే కేరళలోని కోచిలో రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్ తన 14 సంవత్సరాల వయసున్న కుమార్తెతో కలిసి రోడ్డుమీద నడుస్తుంటే ఆయన ఎదుటే ఆమెపై ఒక వ్యక్తి అసభ్య వ్యాఖ్యలు చేశాడు. ఇదేమిటని అడిగిన తండ్రిని హెల్మెట్‌తో ఛాతీపై బాది మరీ గాయపర్చాడు.
ఈ ఉదంతాన్ని విచారించిన కేరళ హైకోర్టు ఇలాంటి చర్యలను అడ్డుకోవలసి ఉందని వ్యాఖ్యానించింది. అమ్మాయి తండ్రే తనపై, తన వెంట ఉన్న మరో వ్యక్తి పై దాడి చేశారని నిందితుడు ఆరోపిస్తే కోర్టు అడ్డుకుంది. కుమార్తెపై లైంగిక వ్యాఖ్యలు చేస్తున్న వారిపట్ల ఏ తండ్రికైనా అలాంటి ప్రతిస్పందనే ఉంటుందని వ్యాఖ్యానించిన కోర్టు నిందితుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ని కొట్టివేసింది.