ఐశ్వర్య, ధనుష్ విడాకుల విషయంలో ఊహించని ట్విస్ట్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న స్టార్ హీరో..!

by Kavitha |
ఐశ్వర్య, ధనుష్ విడాకుల విషయంలో ఊహించని ట్విస్ట్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న స్టార్ హీరో..!
X

దిశ, సినిమా: గత కొంత కాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకుల ట్రెండ్ నడుస్తోంది. ఎందుకంటే పలు సెలబ్రిటీలు డివోర్స్ తీసుకుంటున్నారనే వార్తలు ఈ మధ్య బాగా వింటున్నాము. పెళ్లైన కొన్నేళ్లకే మనస్పర్థలతో విడిపోయే జంటలు కొన్ని ఉంటే.. మరికొంత మంది చాలా కాలం కలిసి పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంటున్న జంటలు ఉన్నాయి. అలా విడిపోతున్న వారిలో కోలీవుడ్ స్టార్ హీరో కూతురు ఐశ్వర్య, ధనుష్ కూడా ఉన్నారు. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే ఈ జంట 2022లో విడిపోతున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఐశ్వర్య, ధనుష్ విడివిడిగా ఉంటున్నారు. కానీ, పిల్లల బాధ్యత మాత్రం ఇద్దరు చూసుకుంటున్నారు. ఇక ధనుష్ విడాకుల గురించి తెలిసిన అభిమానులు అంతా కలిసి బాగుండు అని అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలో వీరి విడాకుల ప్రక్రియలో ఊహించని ట్విస్ట్ ఏర్పడింది.

ఐశ్వర్య, ధనుష్ కలిసి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారనే పుకారు నెట్టింట షికారు చేస్తోంది. రజనీకాంత్ అనారోగ్యం, కుటుంబ కారణాల వల్ల ఐశ్వర్య కాస్తా వెనక్కి తగ్గి ధనుష్‌తో కలిసి ఉండటినికి ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ధనుష్ కూడా తనతో కలిసి ఉండటానికి ఓకే చెప్పాడట. మరి ఇందులో నిజమెంతో తెలియనప్పటికీ.. వారిద్దరూ కలిసి ఉండాలని ఫ్యాన్స్ మాత్రం గట్టిగా కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed