- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అణు యుద్ధానికి రష్యా ఆజ్యం పోస్తోంది.. రష్యాపై జెలెన్‌స్కీ ఫైర్
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ నేపథ్యంలో అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా తన అణ్వాయుధాల గురించి ప్రగల్భాలతో ప్రమాదకరమైన పోరాటానికి ఆజ్యం పోస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన దోహా ఫోరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. 'వారు అణు ఆయుధాలతో దేశాన్ని మాత్రమే కాకుండా గ్రహాన్నే ధ్వంసం చేయాలని చూస్తున్నారు. 1990లలో ఉక్రెయిన్ తన అణు నిల్వలను కూల్చి వేసినప్పుడు రష్యాతో సహా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల నుండి భద్రతా హామీలు ఇచ్చాయి.
అయితే ఇవి ఖచ్చితంగా అమలు చేయట్లేదు' అని చెప్పారు. గొప్ప భద్రతా వాగ్దానాలను ఇవ్వాల్సిన దేశాలలో ఒకటి ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా పని చేయడం ప్రారంభించిందని తెలిపారు. రష్యన్లు తమ పోర్టు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారన్నారు. దీని ప్రభావం ప్రపంచ దేశాలపై ఉంటుందని అన్నారు. రాబోయే రంజాన్ మాసంలోనూ ఉక్రెయిన్ లోని ముస్లింలు పోరాడాల్సి ఉంటుందని చెప్పారు. పవిత్రమైన రంజాన్ మాసం ఉక్రెయిన్‌లోని ప్రజల కష్టాల నుంచి బయటపడాలని ఆయన అన్నారు. ప్రపంచంలో సాధారణ వాయువు ఉత్పత్తి చేసే మొదటి మూడు దేశాల్లో ఒకటైనా ఖతర్‌ను ఉత్పత్తి పెంచాలని కోరారు. యూరోప్ భవిష్యతు మీ ప్రయత్నాలపై ఆధార పడి ఉందని ఖతర్ ను ఉద్దేశించి చెప్పారు. ఇప్పటికే యూరోప్ దేశాలు రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ దిగుమతులను నిలిపివేసి, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్న సంగతి తెలిసిందే.