- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Uddav Thackeray: సంజయ్ రౌత్ కుటుంబ సభ్యులను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే
ముంబై: Uddav Thackeray Meets Family Members of Sena MP Sanjay Raut| ఈడీ అధికారుల విచారణలో అరెస్టైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కుటుంబాన్ని పార్టీ ఛీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సోమవారం కలిశారు. ఠాక్రే సన్నిహితుడైన సంజయ్ తల్లితో పాటు భార్య వర్ష రౌత్‌తో ముంబైలోని భందప్‌లోని నివాసంలో కలిసి మాట్లాడారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'సంజయ్ రౌత్ పట్ల తనకు గర్వంగా ఉందన్నారు. తమను విధ్వంసం చేసేందుకు ఈ అరెస్ట్ కుట్ర. వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడిన వారిని తుడిచిపెట్టేయాలని చూస్తున్నారు. ఇలాంటి ప్రతీకార పూరిత ఆలోచనలు ఉన్నాయి' అని కేంద్రాన్ని విమర్శించారు. దేశంలో 60 నుంచి 65 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉందన్నారు. ఏది శాశ్వతం కాదని, తాను రెండున్నరేళ్లే సీఎంగా కొనసాగానని అన్నారు. ప్రాంతీయ పార్టీలు టీఎంసీ, టీఆర్ఎస్ లీడర్లతో టచ్‌లో ఉన్నానని చెప్పారు. ప్రాంతీయ పార్టీలను తుడిచి పెట్టాలని బీజేపీ ఆలోచిస్తుందన్నారు. గవర్నర్ కొష్యారి వివాదస్పద వ్యాఖ్యలు ప్రాంతీయ పార్టీలు ఐకమత్యంగా ఉండాలనే విషయాన్ని గుర్తు చేశాయన్నారు. విభజన రాజకీయాలతో బీజేపీ హనికరంగా మారిందని నొక్కి చెప్పారు. కాగా, ఆదివారం ఆరుగంటలకు పైగా ఈడీ విచారణ తర్వాత సంజయ్ రౌత్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన నివాసంలో 9 గంటల సోదాల అనంతరం రూ.11.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: బెంగాల్ మంత్రి వర్గంలో మార్పులు