- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం.. నిజాం సాగర్ బ్యాక్ వాటర్‌లో 2 మృతదేహాలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో ప్రమాదావశాత్తు పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందినవారు ఒకరు బేగరి జానయ్య (40 ), మరొకరు పవన్ (45 )గా గుర్తించారు. మృతదేహాలు నీటిలో మునిగి కుళ్లిపోవడంతో అక్కడే పోస్టు మార్టం నిర్వహించారు. ఈ నెల 6న జానయ్య ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదని, చుట్టుపక్కల ప్రాంతాలలో వెతికినా ఆచూకీ లభించలేదని అతని భార్య శాంతవ్వ తెలిపింది. ఈ మేరకు బుధవారం గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి చేపలు పట్టడానికి నిజాం సాగర్ బ్యాక్ వాటర్ కు వెళ్లగా అక్కడ రెండు శవాలు కనిపించడంతో సర్పంచ్ ద్వారా విషయం తెలిసి, కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రాజయ్య తెలిపారు. చేపలు పట్టడానికి వెళ్లి నీటి లోతు తెలియక మునిగిపోయి ఉండవచ్చని ఎస్ఐ తెలిపారు.