- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ పార్టీ దొంగల పార్టీ: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
దిశ, నకిరేకల్ : సీఎం కేసీఆర్ గద్దెనెక్కినప్పటి నుంచి వందల ఎకరాలు సంపాదించాడని, రూ.40 కోట్లతో బంగ్లాతో పాటు ఆస్తులు పెంచుకున్నాడని బీఎస్పీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ దొంగల పార్టీ అని ఆయన అన్నారు. రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆయన బుధవారం నకిరేకల్, అన్నారం, కురుమర్తి, పందెన పల్లి గ్రామాల్లో పర్యటించి పలు సమస్యలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.
ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇల్లు అందాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల జీవితాల్లో వెలుగులు నిండాలంటే రాబోయే రోజుల్లో బీఎస్పీ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. అదే విధంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించలేదని, తక్షణమే వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మండుటెండల్లో ఏళ్ల తరబడి పనులు చేస్తున్న బతుకులు ఎందుకు మారడం లేదని ప్రశ్నించారు. దోపిడీ రాజ్యం తరిమికొట్టి బహుజన రాజ్యాన్ని సాధించుకోవాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ పార్టీని గెలిపించాలని కోరారు.