Raghunandan Rao: 'తెలంగాణలో ఎమర్జెన్సీ విధించేందుకు టీఆర్ఎస్ యత్నం'

by GSrikanth |   ( Updated:2022-06-25 09:16:19.0  )
TRS is set to plan emergency in telangana, says Raghunandan Rao
X

దిశ, వెబ్‌డెస్క్: TRS is set to plan emergency in telangana, says Raghunandan Rao| ఇందిరాగాంధీ ఎలాగైతే ప్రజాస్వామ్యం గొంతు నులిమి, నియంత పాలన సాగించాలని కోరుకున్నారో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అదే పరిస్థితి నెలకొందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో నేడు నిర్బంధాలు, ఒత్తిళ్లు, పోలీసు పాలన తప్ప మరేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో ఈ రోజును బ్లాక్ డేగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా రాఘవాపూర్, బచ్చాయిపల్లిలో శనివారం బీజేపీ జెండాను ఆవిష్కరించిన అనంతరం పెద్దమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. గడిచిన ఎనిమిదేళ్లలో బచ్చాయిపల్లికి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎన్ని? అని ప్రశ్నించారు.

తెలంగాణలో ఎమర్జెన్సీ విధింపు కోసం టీఆర్ఎస్ ప్రయత్నాలు:

రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని రఘునందన్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కుటుంబ సభ్యులు తప్ప మరెవరూ తిరిగే హక్కు లేకుండా పోతోందని మండిపడ్డారు. కేసీఆర్ తన నియంతృత్వ చర్యల వల్ల రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గతంలో ఇందిరా గాంధీ ప్రతిపక్షాలను ఎలాగైతె అణిచివేయాలని ప్రయత్నం చేసిందో ఇప్పుడు కేసీఆర్ సైతం అలాగే చేస్తోందని మండిపడ్డారు. 21 నెలల ఎమెర్జెన్సీని పారద్రోలి మళ్లీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించామని చెప్పారు. గిరిజనురాలిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినా ఇప్పటి వరకు కేసీఆర్ నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యమకారులకు పోరాటాలు చేసిన వారికి ఎలాంటి గుర్తింపు లేదని ఇలాంటి దుర్మార్గపు పాలన ఇంకా ఎంతో కాలం సాగదని హెచ్చరించారు. బీజేపీ ప్రభావంతో ఏళ్ల కొద్ది ఏలుతున్న పార్టీల పునాదులు కదులుతున్నాయని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed