KANGUVA EDITOR: ఇండస్ట్రీలో విషాదం.. ‘కంగువా’ ఎడిటర్ అనుమానాస్పద మృతి

by Kavitha |
KANGUVA EDITOR: ఇండస్ట్రీలో విషాదం.. ‘కంగువా’ ఎడిటర్ అనుమానాస్పద మృతి
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కొలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ అయినటువంటి ‘కంగువా’ సినిమాకు పని చేసిన ఎడిటర్ నిషాద్ యూసుఫ్ కన్నుమూశారు. 43 ఏళ్ల నిషాద్‌ కేరళ పనమ్​పిల్లీ నగర్​లోని తన అపార్ట్​మెంట్​లో మరణించారు. ఈయన అర్ధ రాత్రి 2 గంటల సమయంలో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. అయితే మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈయన నిషాద్ థల్లుమాలా, చావెర్, ఉండా వంటి చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు.

Advertisement

Next Story

Most Viewed