- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గవర్నర్‌కు ఆ అధికారం ఉంది.. వారందరిపై చర్యలు తీసుకోవాలి: Revanth Reddy
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గవర్నర్ ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ టీపీసీసీ ఆధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ పర్యటనలో కీలక అంశాలు వెలుగు చూశాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు గవర్నర్‌పై నిందలు మోపిందని రేవంత్ ఆరోపించారు. ప్రభుత్వం, గవర్నర్ సఖ్యతో పనిచేయాలని ఆయన హితవు పలికారు. 'కేసీఆర్ ప్రస్తుతం కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారని, వాటి నుంచి బయటకు వచ్చేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారని గవర్నర్ చెప్పారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో గవర్నర్‌తో సఖ్యతగా లేనటువంటి కేటీఆర్‌కు సీఎం పదవి కట్టబెట్టడం కుదరదు. అందుకే కేటీఆర్‌ను సీఎం చేసేందుకు గవర్నర్‌ను ఒప్పించే పనిలో టీఆర్ఎస్ నిమగ్నమై ఉంది' అని రేవంత్ అన్నారు.
అయితే కేసీఆర్ రాష్ట్రంలోని వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశారని, ఆసుపత్రుల్లో కుక్కలు, పిల్లులు పెత్తనం చలాయిస్తున్నాని గవర్నర్ చెప్పారని రేవంత్ చెప్పుకొచ్చారు. గవర్నర్‌రే స్వయంగా ప్రభుత్వం గురించి ఇలా చెప్పడమంటే రాష్ట్రంలో ఆరోగ్య శాఖ ఎంత దుర్భరంగా ఉందో అంచనా వేయొచ్చని ఆయన అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయని ఏ పనినైనా సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ ఫైనల్ చేయవచ్చు, గ్రేటర్ పరిధిలో ఏ సమీక్ష అయినా చేసే అధికారం సైతం గవర్నర్‌కు ఉంటుందని రేవంత్ వెల్లడించారు.
విద్య, వైద్యం, డ్రగ్స్ ఇలా ఏ విషయంపైనైనా సమీక్ష చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. గవర్నర్ తన అధికారంతో అన్నింటిని సరిచేయాల్సి ఉంటుంది. అందుకు కావాలసిన అన్ని అధికారాలను గవర్నర్‌కు భారత రాజ్యాంగం ఇచ్చిందని రేవంత్ అన్నారు. ఈ విషయంలో ప్రోటోకాల్ పాటించని ప్రతి అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.