‘బ్లాక్ బస్టర్ దావత్ సెలబ్రేటింగ్ వన్ ఇయర్’ అంటున్న టాలీవుడ్ డైరెక్టర్.. నెట్టింట ఆకట్టుకుంటున్న పోస్ట్

by Kavitha |   ( Updated:2024-10-19 09:15:09.0  )
‘బ్లాక్ బస్టర్ దావత్ సెలబ్రేటింగ్ వన్ ఇయర్’ అంటున్న టాలీవుడ్ డైరెక్టర్.. నెట్టింట ఆకట్టుకుంటున్న పోస్ట్
X

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సినిమా ‘భగవంత్ కేసరి’. గతేడాది రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక అనిల్ రావిపూడి తన జానర్‌ను పక్కన పెట్టి ఫస్ట్ టైం సరికొత్త కాన్సెప్ట్‌తో బాలయ్యను సెటిల్డ్‌గా ప్రసెంట్ చేశాడు. ఇక ఈ మూవీలో డాన్స్ డాల్ శ్రీ లీల బాలయ్య కూతురిగా నటించి మెప్పించింది. కాగా ఇటీవల 2024 ఉత్తమ చిత్రంగా సైమా, ఐఫా అవార్డులు సైతం ఈ చిత్రం గెలుచుకుంది.

ఇదిలా ఉండగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో బాలయ్య బాబు నటించిన భగవంత్ కేసరి మూవీ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘బ్లాక్ బస్టర్ దావత్ సెలబ్రేటింగ్ వన్ ఇయర్’ అనే క్యాప్షన్‌ను జోడించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు జై బాలయ్య అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ మూవీ రిలీజై వన్ ఇయర్ కావడంతో ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.


Advertisement

Next Story

Most Viewed