- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ రోజు ప్రత్యేకత: మొదటి తోక చుక్కను గుర్తించిన రోజు
దిశ, ఫీచర్స్: ప్రముఖ అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త లూయిస్ ఎ. స్విఫ్ట్ 'స్విప్ట్-టట్టల్' అనే తోక చుక్కను కనుగొన్నాడు. 1862 జూలై 16న మొదటి చుక్కను గుర్తించిన ఆయన అదే క్రమంలో 13 తోకచుక్కలను లెక్కించడంతోపాటు 1,248 జాబితాలో లేని స్టార్ ఫార్మింగ్ రీజియన్స్ కనుగొన్నట్లు చరిత్ర చెబుతోంది. అలాగే 'కామెట్ హాలీ(మంచుతో నిండిన సోలార్ సిస్టెమ్ బాడీ)'ని చూసిన కొద్దిమందిలో ఒక్కడైన లూయిస్.. 1878లో రెండు వల్కాన్-రకం గ్రహాలను (మెర్క్యురీ కక్ష్యలో ఉన్న గ్రహాలు) గమనించినట్లు వెల్లడించినా, అధికారికంగా ఆధారాలను చూపించలేకపోవడంతో పరిగణలోకి తీసుకోలేదు. ఇక వీటితోపాటు IC 289 వంటి వందలాది నెబ్యులాలను NGC 6, NGC 19, NGC 27 వంటి గెలాక్సీలను కూడా కనుగొన్నాడు.
అయితే చిన్నప్పటినుంచే ఖగోళశాస్త్రంపై ఆసక్తి కనబరిచే లూయిస్.. స్కూల్లో గురువు తన పరిశీలనను తోసిపుచ్చిన వారం తిరిగేలోపు ఆధారాలతో నిరూపించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇక వీటిని గుర్తించడం కోసం మంచులో పడుకోవడంతోపాటు భారీగా ఖర్చు చేసి 16-అంగుళాల టెలిస్కోప్‌ను కొనుగోలు చేయడం విశేషం. కాగా ఆయన సేవలకుగాను రోచెస్టర్ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్‌డి పట్టాతోపాటు గ్రహశకలం 5035కు స్విఫ్ట్ పేరు పెట్టారు.