మాంసం తినే హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చింది: టీఎంసీ ఎంపీ

by Harish |
మాంసం తినే హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చింది: టీఎంసీ ఎంపీ
X

న్యూఢిల్లీ : మాంసం తినే హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చిందని, అలాగే దుకాణాదారులకు కూడా విక్రయించే హక్కును కల్పించిందని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా స్పష్టంచేశారు. దుర్గా నవరాత్రి సమయంలో 9 రోజులు మాంసం విక్రయాలు నిలిపివేయాలని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ముఖేశ్ సూర్యన్ సోమవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన టీఎంసీ ఎంపీ 'నేను సౌత్ ఢిల్లీలోనే ఉంటున్నాను. నాకు ఏది నచ్చితే అది తినే హక్కు రాజ్యాంగం కల్పించింది' అని ఘాటుగా స్పందించారు.

అంతకుముందు మాంసం బ్యాన్ పై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. 'రంజాన్ సమయంలో సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్యలో మేము ఏమీ తినము. మీరు తెచ్చిన ఆదేశాలతో మేము అంగీకరిస్తాము. మెజార్టీ ప్రజలు నివసించే చోట, ముస్లిమేతరులు బహిరంగంగా మాంసం విక్రయం, తినడాన్ని నిషేధించవచ్చు. సౌత్ ఢిల్లీలోని మెజార్టీ ప్రజలకు ఇది ఓకే. దీనినే జమ్మూకాశ్మీర్‌లోని మెజార్టీ ప్రజలకు అప్లై చేస్తే బాగుంటుందని పరోక్షంగా చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed