హీరోలకు అనుకూలంగా ఉండే వారినే హీరోయిన్స్‌గా తీసుకుంటారు.. ప్రభాస్ బ్యూటీ సంచలన కామెంట్స్

by Kavitha |
హీరోలకు అనుకూలంగా ఉండే వారినే హీరోయిన్స్‌గా తీసుకుంటారు.. ప్రభాస్ బ్యూటీ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: ‘ఝుమ్మంది నాదం’(Jhummandi Nadam) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తాప్సీ పన్ను(Tapsi Pannu) అందరికీ సుపరిచితమే. ఈ మూవీ ఎంతగా హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిలో నటించింది ఈ బ్యూటీ. బట్ టాలీవుడ్‌లో అంతగా నిలదొక్కుకోలేదు. ఇక చేసేది ఏమి లేక బాలీవుడ్‌కి చెక్కేసింది. కానీ అక్కడ మాత్రం వరుస సినిమాలు, లేడీ ఓరియేంటెడ్ మూవీలతో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ అక్కడ చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.. ‘ నేను ఎప్పటినుండో ఇండస్ట్రీలో ఉన్నాను. ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలని కోరుకుంటా, కానీ రెమ్యూనరేషన్ విషయంలో అందరికీ ఒకేలా ఉండదు. ‘జుడ్వా 2’,(Judwaa 2) ‘డంకీ’(Dunky) ప్రాజెక్టుల్లో నటించినందుకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్‌ అందుకున్నానని చాలా మంది అనుకుంటున్నారు. బట్ అందులో అసలు నిజం లేదు. సినీ పరిశ్రమలో హీరోయిన్స్‌ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చూస్తారు.

అంతేకాదు తమ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటించాలనే విషయాన్ని చాలా సందర్భాల్లో హీరోనే నిర్ణయిస్తారు, హీరోస్‌ను డామినేట్ చేసే విధంగా హీరోయిన్స్ ఉండకూదని, హీరోలని డామినేట్ చెయ్యకుండా తమకి అనుకూలంగా ఉండే హీరోయిన్స్‌నే తీసుకంటారు’ అని తాప్సీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story