Prabhas Movie: ప్రభాస్ మూవీలో ఆ స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్..!

by Prasanna |   ( Updated:2024-10-19 04:37:23.0  )
Prabhas Movie: ప్రభాస్ మూవీలో ఆ స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్..!
X

దిశ, వెబ్ డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ‘స్పిరిట్’ సినిమా వస్తున్న విషయం మనకీ తెలిసిందే. ప్రభాస్ ఇలాంటి డైరెక్టర్ చేతిలో పడితే బాక్సాఫీస్ బద్దలవ్వడం పక్కా. వీరిద్దరి కాంబోలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని సినీ ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.

ప్రీపొడక్షన్‌ లో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మూవీలో ప్రభాస్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. తన సినీ కెరీర్ లో మొదటిసారి పోలీస్‌ పాత్రను చేస్తున్నాడు. ఈ సినిమాలో డార్లింగ్ డ్యూయెల్ రోల్ లో మెప్పించనున్నారు. అయితే, ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది.

ఈ మూవీలో రణబీర్‌కపూర్‌, విజయ్‌ దేవరకొండ గెస్ట్‌ రోల్స్‌లో కనిపించనున్నారని ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. వీరిద్దరి కోసం ప్రత్యేకంగా రెండు పాత్రలను డిజైన్ చేశారట. మేకర్స్ నుంచి దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదే నిజమైతే అభిమానులకు పెద్ద పండగే అని చెప్పొచ్చు. 2026 లో ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రానుంది.

Advertisement

Next Story

Most Viewed