- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానసిక ఆరోగ్యం కోసం యాప్.. ఏమిటంటే ?
దిశ, ఫీచర్స్ : 'అందరికీ ఆరోగ్యం' అనేది విశ్వవ్యాప్తంగా వినిపిస్తున్న ఓ నినాదం. ప్రపంచవ్యాప్తంగా క్వీర్ కమ్యూనిటీ పెరుగుతున్న వేళ.. నేటికీ వారిపై చిన్నచూపు, కళంకం, వివక్ష, పక్షపాతం కొనసాగుతోంది. ఈ అవమానం, తిరస్కరణ LGBTQ+ వ్యక్తుల జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఆరోగ్య సంరక్షణ సేవలకు యాక్సెస్ దక్కకుండా నిరోధిస్తోంది. ఈ ఆరోగ్య సమస్యలు నేరుగా లైంగిక ప్రాధాన్యతలకు సంబంధించినవి కావచ్చు లేదా మెంటల్ హెల్త్, మాదకద్రవ్యాల దుర్వినియోగం, నిరాశ్రయత, నిరుద్యోగం వంటివి కావచ్చు. ప్రధానంగా 'మెంటల్ హెల్త్' సమస్యలు తీర్చేందుకు సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం కీలక సమస్యగా ఉంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నదే 'ఎవాల్వ్(Evolve)' యాప్ . ఈ ఇండియన్ మేడ్ యాప్ వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎలా సాయపడుతుంది? ఈ ప్లాట్‌ఫామ్‌లో ఎంతమంది వైద్యులు అందుబాటులో ఉంటారు? వంటి విశేషాలు తెలుసుకుందాం.
ఆరోగ్య సంరక్షణ విషయంలో LGBTQ+ కమ్యూనిటీకి సదుపాయాలు తక్కువనే చెప్పాలి. అంతేకాదు క్వీర్ కమ్యూనిటీ వ్యక్తుల శారీరక, మానసిక సమస్యల గురించి అవగాహన లేకపోవడం, శిక్షణ లేకపోవడం, కమ్యూనికేషన్, కౌన్సెలింగ్‌లో అసౌకర్యం కారణంగా హెల్త్‌కేర్ నిపుణులు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. థెరపిస్ట్‌ల విషయానికొస్తే.. చాలా మంది థెరపిస్ట్‌లు సమాజంలోని విభిన్న వ్యక్తులు ఎదుర్కొనే సమస్యలను అర్థం చేసుకునేందుకు శిక్షణ పొందలేదు. కాగా ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఆంత్రప్రెన్యూర్ అన్షుల్ కామత్ 'ఎవాల్వ్' పేరుతో ఓ యాప్ తీసుకొచ్చింది. ఇది క్వీర్ కమ్యూనిటీతోపాటు అందరికీ అందుబాటులో ఉండే యాప్.
ఎవాల్వ్ అనేది కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ(CBT). మైండ్‌ఫుల్‌నెస్ వంటి శాస్త్రీయంగా నిరూపితమైన పద్ధతుల సాయంతో చికిత్స అందిస్తోంది. యూజర్ యాప్‌లో లాగిన్ అయినప్పుడు వయస్సు, లింగం, లైంగికత ఆధారంగా ప్రొఫైల్‌ను సృష్టిస్తుంది. యాప్ ఓపెన్ చేసినప్పుడు, సైన్ అప్ చేస్తున్నప్పుడు మృదువైన సంగీతం సహా పక్షుల కువకువలు, ఇతర ప్రకృతి ధ్వనులు ఆకర్షిస్తుంటాయి. ఇక యాప్‌లో ఎంటరైన తర్వాత అందులో థెరపీ, మెడిటేషన్, స్లీప్, జర్నలింగ్ వంటి నాలుగు భిన్నమైన సెక్షన్స్ చూపిస్తుంది. బాగా నిద్రపోవడానికి, ఆందోళన అధిగమించడానికి, ఒత్తిడి తగ్గించడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఆయా థెరపీలు సాయపడతాయి. హోమ్‌పేజీలో అవసరమైన ప్రతీ సమాచారం ఉంటుంది. మానసిక ఆరోగ్య నిపుణులతో మిమ్మల్ని కనెక్ట్ చేసేందుకు 'ఎక్స్‌పర్ట్స్' బటన్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. LGBTQIA+ వ్యక్తుల విషయానికొస్తే ఇందులోని థెరపీ సెషన్స్ ఇంట్లో స్వలింగ సంపర్కంతో వ్యవహరించదు, వారిపై మరొకరి వైఖరిని మార్చుకోవడంపై దృష్టి పెడతాయి.
గత సంవత్సరం ప్రైడ్ నెలలో LGBTQIA+ కమ్యూనిటీ సభ్యులు మా యాప్ పట్ల సహజంగా ఆకర్షితులవడం గ్రహించాం. మేము కమ్యూనిటీ సభ్యులతో మాట్లాడటం వల్ల వారి అవసరాలు ఇతరుల కంటే ఎంత భిన్నంగా ఉన్నాయో గ్రహించగలిగాం. ముఖ్యంగా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నట్లు గుర్తించి, వారికి ఓ ఉత్తమ ప్లాట్‌ఫామ్ అందించేందుకు ఈ కొత్త ఫీచర్స్ తీసుకొచ్చాం. కమ్యూనిటీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు, వినియోగదారుల నుంచి ఇన్‌ఫుట్స్ తీసుకున్నాం. ప్రస్తుతం క్వీర్ కమ్యూనిటీకి అందిస్తున్న సేవలను గూగుల్ గుర్తించింది. ఈ ఏడాది ప్రైడ్ మంత్ సందర్భంగా గూగుల్ ప్లేలో ఫీచర్ చేయబడిన యాప్స్‌లో Evolve ఒకటి, ఇది మాకు చాలా ప్రత్యేకమైనది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200,000 మంది క్వీర్ వ్యక్తులు యూజర్లుగా ఉన్నారు. ఇండియా, ఉత్తర అమెరికాల నుంచి దాదాపు 80% మంది వినియోగదారులుండగా, మిగతా 20శాతం 100కి పైగా దేశాలకు చెందినవారు. యాప్‌లో సగానికి పైగా సేవలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. LGBTQIA+ కంటెంట్ కూడా ఉచిత టైర్‌లో భాగమే. ప్రీమియం టైర్ 'Evolve Plus'కి మాత్రం నెలకు ₹400 లేదా ఏడాదికి రూ. 999 చెల్లించాలి
- అన్షుల్ కామత్, ఫౌండర్
క్వీర్ వ్యక్తులు కూడా ఈ దేశ పౌరులే. వారికి ఆరోగ్య సంరక్షణలో సమానత్వ హక్కును అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలతో సహా సమాజంపై ఉంది. LGBTQ+ కమ్యూనిటీ మానసిక ఆరోగాన్ని పరీక్షించేందుకు నిపుణులకు అవసరమైన శిక్షణ అందివ్వాలి. అంతేకాదు వారి సామాజిక, సాంస్కృతిక, భావోద్వేగ, భౌతిక అంశాల పట్ల సమగ్ర విధానాన్ని అవలంబించాలి. వారికి మానసిక చికిత్స అందించాలంటే ముందుగా వాళ్లు దాటుకుని వచ్చిన అడ్డంకులు, సమాజ వివక్ష, కుటుంబ హింస, పక్షపాతంతో పాటు పాఠశాలు, బహిరంగ ప్రదేశాలు, ఉద్యోగావకాశాల్లో వాళ్లు పొందిన అవమానాలు వంటి ఎన్నో విషయాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
- డాక్టర్ అరుణ, ఫోర్టిస్ హాస్పిటల్, బెంగళూరు