- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మృతదేహం తలను ఎత్తుకెళ్లిన దొంగలు.. బయటపడ్డ మంత్రగాళ్ల నిర్వాకం
దిశ, వెబ్డెస్క్: నగలు, డబ్బు, వాహానాలు దొంగతనానికి గురవుతుంటాయని తెలిసిందే. కానీ, చితిలో మృతదేహం తలను దొంగలించుకెళ్లారు కొంతమంది. ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్లోని బరేలీ ప్రాంతంలో చోటుచేసుకుంది. తలను ఎత్తుకెళ్లిన ముగ్గురు మంత్రగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టిల్హార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్రోలీ గ్రాయంలో కుబేర్ గంగ్వార్(60) అనే వ్యక్తి మరణించాడు. అతడికి గ్రామశివారులో ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపించారు. చితిలో మృతదేహం పెట్టి నిప్పంటించారు. అనంతరం అక్కడినుండి వెళ్లిపోయారు. వారు వెళ్లడంతో ఓ ముగ్గురు చితి దగ్గరకు వచ్చి కాలుతున్న శరీరం నుంచి తలను వేరు చేసి తీసుకెళ్లారు. ఇది గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్పి సంజీవ్ కుమార్ అక్కడికి చేరుకొని ఉపేంద్ర, సురేంద్ర కుమార్, మనోజ్ అదుపులోకి తీసుకున్నారు. పుర్రెతో పూజలు చేస్తే ధనికులం అవుతామని, అందుకే దొంగలించామని నిందితులు పేర్కొన్నారు. నిందితులపై 297 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఎస్పి సంజీవ్ కుమార్ తెలిపారు.