కొంపముంచిన దొంగతనం.. అలా ఇరుక్కుపోయాడు

by samatah |
కొంపముంచిన దొంగతనం.. అలా ఇరుక్కుపోయాడు
X

దిశ, ఉత్తరాంద్ర : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కంచిలి మండలం జడిపుడి గ్రామంలో మంగళవారం నాడు విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గాల జమ్మి గుడిలో దొంగతనానికి వెళ్లిన ఓ దొంగ గుడి కిటికీలను విరగ్గొట్టి లోపలకి ప్రవేశించాడు. అనంతరం అమ్మవారి బంగారు నగలను దొంగిలించి అదే కిటికీ‌లో నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. అయితే బయట నుంచి లోపలకి వెళ్లిన దొంగ లోపల నుండి బయటకు రాలేక ఇరుక్కుపోయాడు. దీంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం గుడి తలుపులు తెరిచి దొంగను సురక్షితంగా బయటకు తీశారు.

Advertisement

Next Story