- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీసీసీబీ కథ కంచికేనా..? అక్కడ టీఆర్ఎస్ కండువా కప్పుకుంటే ఏ నేరం ఉండదు
దిశ, ఖమ్మం టౌన్: టీఆర్ఎస్ కండువా కప్పుకుంటే చాలు ఏ నేరం నుంచైనా రక్షించబడతారు అనే సందేశం ఇస్తుంది జిల్లా పార్టీ. చిన్న చిన్న తప్పులను సూక్ష్మంగా పరిశీలించి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యమిస్తూ, నిరసన గళం విప్పే నాయకుల పై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారు. ఎన్ని తప్పులు చేసిన గులాబీ తీర్థం తీసుకుంటే అన్ని ఒప్పులుగా మారిపోతాయనే సందేశం వర్తిస్తుంది. దానికి ఉదహారణ మాజీ డీసీసీబీ పాలకవర్గం పై చర్యలు తీసుకోకపోవడం అని అంటున్నాయి ప్రతి పక్షాలు. ఆర్బీఐ గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా కోట్ల రూపాయల నిధులు అక్రమ మార్గాన దారి మళ్లించి, వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకొని రైతులు బ్యాంకుల్లో జమ చేసుకున్న డబ్బులలో నుంచి వేల రూపాయలు కోత విధించి బలవంతంగా సెల్ ఫోన్లు అంటగట్టారు.
ఆరోగ్యం కోసం ఆసుపత్రి పేరుతో కోట్లు వెచ్చించి హాస్పిటల్ నిర్మాణం చేపట్టి ఇప్పుడు ఆ ఆసుపత్రిని ప్రైవేట్ వారికి కట్టబెట్టారు. ఇప్పుడు రైతుల కోసం నిర్మించిన సి స్టార్ ఆసుపత్రిలో రైతులకు ఎటువంటి వైద్య సేవలు అందించడం లేదు. స్వయానా డీసీసీబీ సిఈఓ అధికారికంగా గత డీసీసీబీ పాలక వర్గం పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే ఆ కేసు గురించి ఇంత వరకు మాట్లాడిన పోలీస్ అధికారి లేరు. తాను తప్పించుకోవడం కోసం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడి అవతారం ఎత్తి కేసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడని మువ్వా పై ఆరోపణలున్నాయి. మాజీ ఎంపీ నేర చరిత్ర కలిగిన వారికి, అక్రమాలు చేసే వారికి షెల్టర్ ఇస్తారనే విమర్శలున్నాయి.
అనేక వివాదాల్లో అనేక రకాల ఆర్థిక పరమైన అంశాల్లో జోక్యం చేసుకొని పోలీస్ కేసులైన వ్యక్తులు అనేక మంది ఆయన ఫాలోవర్స్ గా వున్నారు. ఆర్బీఐ నిబంధనలను ఉల్లఘించి సొసైటినే భ్రష్టుపట్టించి రైతుల పేరుతో కొత్త మోసానికి తెరలేపి భూమి లేకున్నా కాగితాల పై లోన్లు ఇచ్చి లక్షలు, కోట్లు కమీషన్లు దండుకున్నాడనే ఆరోపణలు మాజీ డీసీసీబీ చైర్మన్ పై ఉన్నాయి. రైతుల పేరుతో మోసాలకు పాల్పడిన వ్యక్తి ని దగ్గరికి రానివ్వకూడదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దూరం పెట్టడంతో జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదని భావించిన మువ్వా పొంగులేటి వద్దకు వెళ్లి శరణు కోరినట్లు ప్రజల నుంచి వినిపిస్తున్న విమర్శ.
డీసీసీబీలో ఉద్యోగాల నియమాకాల నుంచి మొదలు, జంతువుల కొనుగోలు వ్యవహారంలో మిట్టపల్లి ప్రాంతం నుంచి కొన్న గేదెలు, ఆంధ్ర ప్రాంతం నుంచి కొన్నట్లు తప్పుడు లెక్కలు చూపినట్లు ఆరోపణలున్నాయి. రైతులకు అవసరమైన ప్రతి అంశాన్ని పైసలుగా మార్చి వాటర్ ప్లాంట్ ఓనర్ నుంచి విల్లాలు నిర్మించడమే కాకుండా అంతరాష్ట్ర స్థాయిలో వెంచర్లు వేసే స్థాయికి వెళ్లాడనే ఆరోపణలున్నాయి. సామాన్య ప్రజలకైతే ఓ రకమైన శిక్ష, అధికార అండ ఉంటే మరో రకమైన భిక్ష అన్నట్లు వ్యవహరిస్తున్న తీరు పై పలు విమర్శలకు కారణం అవుతుంది. ఇప్పటికైన అధికార పార్టీ పై నమ్మకం రావాలంటే రైతుల పేరుతో మోసాలకు తెరలేపిన మాజీ డీసీసీబీ అధ్యక్షుడు పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతుంది.