Narudi Bratuku Natana: జీవితమే తెలియనివాడు యాక్టర్ అవ్వడం కష్టం.. ఫ్రెండ్ మాటతో ఊరు వదిలి వెళ్లిపోయిన హీరో

by sudharani |   ( Updated:2024-10-11 14:44:17.0  )
Narudi Bratuku Natana: జీవితమే తెలియనివాడు యాక్టర్ అవ్వడం కష్టం.. ఫ్రెండ్ మాటతో ఊరు వదిలి వెళ్లిపోయిన హీరో
X

దిశ, సినిమా: శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’ (Narudi Bratuku Natana). శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి ఈ సినిమాను నిర్మింస్తున్నారు. ఇప్పటి వరకు ఇందులో నుంచి ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. తాజాగా ‘నరుడి బ్రతుకు నటన’ నుంచి థియెట్రికల్ ట్రైలర్ (Theatrical trailer)ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసి.. యూనిట్‌కి అల్ ది బెస్ట్ తెలిపారు.

ఇక ట్రైలర్ (trailer) విషయానికి వస్తే.. శివ కుమార్ (Shiva Kumar) నటుడు అవ్వాలని ఆడిషన్స్ ఇస్తూ ఫెయిల్ అయ్యే సీన్‌తో ఓపెన్ అవ్వగా.. అందరూ అతడ్ని నిరుత్సాహ పరుస్తూనే ఉంటారు. జీవితం అంటే ఏంటో తెలియని వాడు జీవితంలో యాక్టర్ అవ్వడం కష్టం అని హీరో ఫ్రెండ్ చెప్పడంతో.. ఓ తెలియని ఊరికి వెళ్తాడు శివ కుమార్ (Shiva Kumar). అలా కథ హైద్రాబాద్ (Hyderabad) నుంచి కేరళకు షిఫ్ట్ అవుతుంది. ట్రైలర్‌లో చూపించిన కేరళ (Kerala) అందాలు, సినిమాలోని ఎమోషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. హాస్యం, ప్రేమ, ఎమోషన్ ఇలా అన్ని రకాల అంశాలను జోడించి ఈ చిత్రాన్ని తీశారని ట్రైలర్ చెబుతోంది. ప్రజెంట్ ఈ ట్రైలర్ నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది.


Advertisement

Next Story