- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ గ్రహంపై రత్నాల వర్షం!
దిశ, ఫీచర్స్ : వర్షాకాలపు వానలు సాధారణమే అయినా వేసవిలో మాత్రం వడగళ్లు కురిసి నష్టాన్ని కలిగిస్తుంటాయి. ఇంకా కొన్నిసార్లు ఆకాశం నుంచి వర్షపు చినుకులతో పాటు కప్పలు, పాములు కూడా నేలపై రాలుతుంటాయి. టీవీల్లో ఇలాంటి సంఘటనలు చూసి ఆశ్చర్యపోతుంటాం. అయితే ఇవన్నీ కాకుండా నీలి మేఘాల నుంచి రత్నాలు కురిస్తే ఎలా ఉంటుంది? ఒక్కరోజులో లక్షాధికారులం అయిపోవచ్చు కదా! ఇప్పుడు ఓ గ్రహం మీద నిజంగా అలాంటి వర్షమే పడుతోందని పరిశోధకులు వెల్లడించారు.
'WASP-121b' అనే గ్రహం భూమి నుంచి 855 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతుంటుంది. 2015లో మొదటిసారిగా గుర్తించబడిన ఈ గ్రహం 'బృహస్పతి'ని పోలి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. సౌర వ్యవస్థలోని అతిపెద్ద గ్రహం కంటే ఎక్కువ ద్రవ్యరాశి, వ్యాసాన్ని కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ ప్లానెట్ మీదే రత్నాల వర్షం కురుస్తోందని, అది మెరుస్తున్న నీటి ఆవిరి వాతావరణాన్ని కలిగి ఉంటుందని వివరించారు. అత్యధిక గురుత్వాకర్షణ శక్తి గల ఈ గ్రహం.. చంద్రుడి తరహాలోనే ప్రతి 30 గంటలకు ఒక కక్ష్యను పూర్తి చేస్తుంది. ఒక వైపు ఎల్లప్పుడూ నక్షత్రానికి ఎదురుగా ఉండగా, మరొక వైపు ఎప్పుడూ చీకటే ఆవహించి ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతా వ్యత్యాసాల కారణంగానే చీకటి వైపు ఇనుము, కొరండంతో తయారైన లోహ మేఘాలను ఏర్పరిచేందుకు అనువైన చల్లదనాన్ని అందిస్తుండగా.. రెండో వైపు వేడి కారణంగా మేఘాలు కరిగిపోయి నీలమణి, కెంపులు వంటి రత్నాలు వర్షిస్తున్నాయి.
ఈ మేఘాలు పగటి వైపునకు ప్రయాణించినప్పుడు అవి వాయువులుగా ఆవిరైపోయి, గ్రహం మీద ద్రవ రత్నాల వర్షం కురుస్తుంది. అయితే దురదృష్టవశాత్తు ఏ మానవుడు కూడా ఈ ఎక్సోప్లానెట్ మీద జీవించలేడని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఖగోళ శాస్త్రవేత్తలు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగించి ఈ ఏడాది చివర్లో WASP-121bని పరిశీలించనున్నారు.