- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడాకులు తీసుకోబోతున్న స్టార్ కపుల్.. హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం?
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొందరు భార్యాభర్తలుగా జీవితాన్ని కొనసాగిస్తుంటే మరికొందరు మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ విడాకులు తీసుకుని విడిపోయారు. చిన్న చిన్న మనస్పర్థలు రావడంతో వివాహ బంధానికి స్వస్తి పలికారు. తాజాగా, ఓ స్టార్ హీరో కూడా డైవర్స్ తీసుకోబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan), కరీనా కపూర్ విడాకులు తీసుకోవడానికి సిద్ధపడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి ఇద్దరు పిల్లలు తైమూర్, జహంగీర్ అలీ ఖాన్ కూడా ఉన్నారు.
సైఫ్ తన చేతిపై వేసుకున్న కరీనా కపూర్(Kareena Kapoor) టాటూను వేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దానిని తొలగించడంతో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దాని స్థానంలో త్రిశూలం ఆకారంలో కొత్తగా ఓ టాటూను వేయించుకున్నట్లు కొన్ని ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ విడాకుల వార్తలకు బలం చేకూరినట్లు అయింది. కరీనాతో విడిపోయి సైఫ్ మూడో పెళ్లి చేసుకోబోతున్నడనే రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు మాత్రం మీరు మూడో పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే టాటూ తొలగించారు కదా అని కామెంట్లు పెడుతున్నారు. కాగా, 1991లో సైఫ్ అమృతా సింగ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి సారా అలీ ఖాన్(Sarah Ali Khan), ఇబ్రహీం అలీ ఖాన్ (Ibrahim Ali Khan)ఉన్నారు. అయితే వీరిద్దరు 13 ఏళ్ల తర్వాత 2004లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత సైఫ్ కరీనా కపూర్‌ను ప్రేమించి రెండోసారి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సైఫ్ రెండో భార్యతో డైవర్స్ తీసుకునేందుకు సిద్ధమయ్యాడని వార్తలు రావడంతో మూడో పెళ్లి చేసుకోబోతున్నాడని అంతా గుసగుసలాడుకుంటున్నారు. ప్రజెంట్ వీరి విడాకులు హాట్ టాపిక్‌గా మారాయి.