- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణపై పంజాబ్ ఎన్నికల ప్రభావం ఉండదు : భట్టి
దిశ, తెలంగాణ బ్యూరో : పంజాబ్ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ పైన చూపబోవని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఆయన ఎన్నికల ఫలితాలపై సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా పనిచేసిన కాలంలో ఆయన వైఫల్యమే కాంగ్రెస్ ను ఈ ఎన్నికల్లో దెబ్బతీసిందని అన్నారు. పంజాబ్ కాంగ్రెస్ నేతల తీరు కూడా అందుకు తగ్గట్టుగానే ఉందని, రోగం ముదిరాక మందు వేసినట్టుందని వ్యాఖ్యానించారు. అయినా రాజకీయాల్లో గెలుపోటములు సహజమని భట్టి పేర్కొన్నారు.
అయితే పంజాబ్ రాజకీయాలకు, తెలంగాణ రాజకీయాలకు తేడా ఉందని, పంజాబ్ ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపబోదని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు తప్ప వివాదాలు లేవన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ లోపాలు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పంజాబ్‌లో అంతర్గత పంచాయితీలు సమస్య కాదన్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమన్నారు. పంజాబ్ ప్రజలు పక్కనే ఉన్న ఢిల్లీ ప్రభుత్వానికి ఎట్రాక్ట్ అయ్యారన్నారు. తెలంగాణలో బీజేపీకి ప్లేస్ లేదన్నారు. ఇక్కడ బలమైన పార్టీ కాంగ్రెస్ అధిష్టానం ఐదు రాష్ట్రాల ఫలితాలతో పాఠం నేర్చుకోవాలని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.