- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RGV: అమ్మాయిలకు విచ్చలవిడితనం పెరిగిపోతోంది.. దుమారం రేపుతున్న ఆర్జీవి కామెంట్స్
దిశ, సినిమా: వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ(RGV) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎంతో మంది అమ్మాయిలకు లైఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా సోషల్ మీడియాలో చీరలో కనిపించిన ఓ అమ్మాయి అందానికి ఫిదా అయి.. ఆమెను ‘శారీ’(Saree) అనే సినిమాలో హీరోయిన్‌గా పెట్టుకొని మూవీ తీస్తున్నాడు. ఈ చిత్రంతో శ్రీలక్ష్మి(Sri Laxmi) అలియాస్ ఆరాధ్య దేవి(Aaradhya Devi)ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేపిస్తున్నారు. అయితే దీనిని కృష్ణకమల్(Krishna Kamal) తెరకెక్కిస్తుండగా.. ఆర్జీవీ సమర్పణలో రాబోతోంది. ఇందులో సత్యా యాదు(Sathya Yaadu), ఆరాధ్య దేవి జంటగా నటిస్తున్నారు.
ఇటీవల ‘శారీ’ మూవీకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయడంతో ఈ మూవీ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు(Telugu), హిందీ(Hindi), తమిళం(Tamil), మలయాళ(Malayalam) భాషల్లో డిసెంబర్ 10న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ప్రముఖ పంపిణీ దారుడు రాందాస్(Ramdas) మంచి రేట్‌తో ‘శారీ’ మూవీను తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఆయన మాట్లాడుతూ.. “ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా భయానకమైన రిలేషన్స్‌కి తెరలు లేపుతుంది. సోషల్ మీడియా అనేది జనాలకు మేలు చేయకపోగా ‘యాంటీ సోషల్ మీడియాగా’ మారుతోంది. ఇన్‌స్టాగ్రామ్(Instagram) వంటి యాప్‌ల ద్వారా చాలా మందిలో విచ్చలవిడితనం పెరిగిపోతోంది. టీనేజ్ అమ్మాయిలు వాటిలోని నిజాలను గ్రహించలేక ఆకర్షితులవుతున్నారు. మితి మీరిన ప్రేమ ఎంత భయంకరంగా మారొచ్చు అనేది ఈ శారీ చిత్రంలోని ప్రధాన అంశం. వయసులో ఉన్న అమ్మాయిలకు కనువిప్పు కలిగేలా ఈ సినిమా తెరకెక్కింది” అని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఆర్జీవీ వ్యాఖ్యలపై కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాని కేవలం అమ్మాయిలే యూస్ చేస్తున్నారా అంటూ ఫైర్ అవుతున్నారు.