కివీస్ ఆటగాళ్లకు క్లియరెన్స్ ఇచ్చిన న్యూజిలాండ్ బోర్డు

by Harish |
కివీస్ ఆటగాళ్లకు క్లియరెన్స్ ఇచ్చిన న్యూజిలాండ్ బోర్డు
X

న్యూఢిల్లీ : ఐపీఎల్‌లో కివీస్ ఆటగాళ్లు పాల్గొనడంపై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు శుక్రవారం స్పష్టతనిచ్చింది. లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లకు అడ్డంకులు తొలగించింది. ఈ ఏడాది 12 మంది కివీస్ ఆటగాళ్లు ఐపీఎల్‌ ఆడనున్నారు. ఇందులో కేన్ విలియమ్సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే, నెదర్లాండ్‌తో కివీస్ జట్టు మార్చి 26న ఏకైక టీ20, మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో కివీస్ ఆటగాళ్లు ఈ ఏడాది పలు మ్యాచ్‌లకు దూరమవుతారని ప్రచారం జరిగింది. అయితే, నెదర్లాండ్‌తో జరిగే సిరీస్‌కు ఐపీఎల్‌లో పాల్గొనని ఆటగాళ్లను ఎంపిక చేస్తామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. దాంతో కివీస్ ఆటగాళ్లకు అడ్డంకులు తొలిగిపోవడంతో లీగ్ ఆరంభం నుంచే ఐపీఎల్‌లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు వచ్చే వారంలో తమ ఫ్రాంచైజీలతో కలవనున్నారు.



Advertisement

Next Story