సైలెంట్‌గా సర్వసభ్య సమావేశం.. ఇదేంటని ప్రశ్నిస్తే..!

by Satheesh |
సైలెంట్‌గా సర్వసభ్య సమావేశం.. ఇదేంటని ప్రశ్నిస్తే..!
X

దిశ, బూర్గంపాడు: బూర్గంపాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం గుట్టుచప్పుడు కాకుండా మండల అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నిర్వహించారు. ప్రతి సర్వసభ్య సమావేశానికి రెండు రోజులు ముందుగానే విలేకరులతోపాటు మండల అధికారులకు, సర్పంచులకు, ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇచ్చే మండల పరిషత్ అధికారులు.. ఈసారి తమకు అనుకూలంగా ఉన్న అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ విషయంపై మండల పరిషత్ అధికారిని వివేక్ రామ్‌ను ప్రశ్నిస్తే.. అసలు మండల పరిషత్ కార్యవర్గమే లేనప్పుడు ఎవరికి చెప్పాల్సిన అవసరం ఏముంది.. అని సమాధానం చెప్పడం కొసమెరుపు.

Advertisement

Next Story