Balakrishna: బాలయ్య సినిమా కోసం ఇంత వరకు రాని డిఫరెంట్ టైటిల్స్ ను పరిశీలిస్తున్న మేకర్స్

by Prasanna |
Balakrishna: బాలయ్య సినిమా కోసం ఇంత వరకు రాని డిఫరెంట్ టైటిల్స్ ను పరిశీలిస్తున్న మేకర్స్
X

దిశ, వెబ్ డెస్క్ : బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK109 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేయగా తాజాగా దసరా సందర్భంగా ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ ఇచ్చారు. NBK 109 సంక్రాంతి బరిలో ఉంటుందని ప్రకటించారు. అలాగే, టైటిల్ అనౌన్స్ దీపావళికి రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

దీంతో ఇప్పుడు అందరూ ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారా ఆలోచనలో పడ్డారు. అయితే, ఈ మూవీ కోసం రెండు డిఫరెంట్ టైటిల్స్‌ని మేకర్స్ పరిశీలిస్తున్నారని సమాచారం. ‘డాకూ మహారాజా’, ‘సర్కార్ సీతారామ్’ అనే రెండు వెరైటీ టైటిల్స్‌లో ఈ మూవీకి ఏదోకటి పెట్టాలని చూస్తున్నారట.

Advertisement

Next Story

Most Viewed