'చికెన్ 65'కి ఆ పేరెలా వచ్చింది?

by Manoj |   ( Updated:2022-03-09 16:38:45.0  )
చికెన్ 65కి ఆ పేరెలా వచ్చింది?
X

దిశ, ఫీచర్స్ : చికెన్ ప్రేమికుల ఫేవరెట్ లిస్ట్‌లో 'చికెన్ 65' తప్పనిసరిగా ఉంటుంది. దీన్ని స్టార్టర్‌గా లేదా రూమాలి రోటీకి కాంబినేషన్‌గా సర్వ్ చేస్తుంటారు. దక్షిణ భారతదేశంలో ఉద్భవించిన ఈ డీప్-ఫ్రైడ్ చికెన్ డిష్ దేశవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందింది. అయితే ఈ ఐకానిక్ డిష్‌ పేరులో 'నెంబర్' ఎందుకుందని మీరెప్పుడైనా ఆలోచించారా? లేదు కదా! అయితే దీని వెనకున్న ఆసక్తికరమైన కథనాన్ని తెలుసుకుందాం.

'చికెన్ 65' డిష్ తయారీలో ఉపయోగించిన 65 పదార్థాల వల్ల ఈ వంటకానికి ఆ పేరు వచ్చిందని లేదా చికెన్‌ను తయారు చేయడానికి ముందు 65 ముక్కలుగా కట్ చేసిందని కొందరు ఊహిస్తారు. చికెన్‌ను 65 రోజులు మ్యారినేట్ చేశారని కూడా మరికొందరు అనుకుంటారు. అంతేకాదు మెనూ కార్డు సీరియల్ నెంబర్‌లో 65వ స్థానంలో ఈ డిష్ ఉండటం వల్లనే ఆ పేరు వచ్చిందని మరికొందరు అపోహ పడుతుంటారు. వాస్తవానికి 1965లో చెన్నయ్‌లోని ఎ.ఎమ్. బుహారీ హోటల్‌ మెనూలో దీన్ని తొలిసారిగా చేర్చగా, ఐటెమ్ ప్రజాదరణ పొందడంతో బుహారీ యాజమాన్యం 1978, 1982, 1990లో ఆయా ఇయర్స్ ఆధారంగా చికెన్ 78, 82, 90 వెర్షన్స్‌ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. అయితే చికెన్ 65 మాదిరిగా వీటికి అంతగా ఆదరణ దక్కలేదు. అలా 1965లో ఈ వంటకం భోజన ప్రియులకు అందుబాటులోకి రావడంతోనే దీనికాపేరు వచ్చింది. యాదృచ్ఛికంగా, చెన్నయ్‌లో ఫైన్ డైనింగ్‌ను ప్రవేశపెట్టిన మొదటి ప్రదేశం కూడా బుహారీ హోటల్ కావడం విశేషం.

బుహారీ తను ఇంట్రడ్యూస్ చేసిన చికెన్ 65పై పేటెంట్ పొందాలని సన్నిహితులు సూచించగా, అందుకు అతడు నిరాకరించాడని సమాచారం. ఆహారం ఎవరి సొత్తు కాదని, దానిని వ్యాపారంగా మార్చకూడదని ఆయన విశ్వసించారు. అతడి ఆలోచన నిస్వార్థ వైఖరి కారణంగా చికెన్ 65 నాన్-వెజిటేరియన్ మెనూలలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది.


ఇంధనం లేకుండా నడిచే రైలు వచ్చేస్తోంది!

Advertisement

Next Story

Most Viewed