342 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

by Web Desk |
342 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
X

దిశ, ఖమ్మం: ఖమ్మంలో 342 మందికి శాశ్వత ఇండ్ల పట్టాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం పంపిణీ చేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ రాజీవ్ నగర్ గుట్టలో 77 మందికి, 58 వ డివిజన్ దొరన్న కాలనీలో 127, 31వ డివిజన్ కాటన్ మార్కెట్ ప్రాంతంలో 138 మంది స్థానికులకు ఇళ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. దీంతో 342 మందికి శాస్వత ఇండ్ల పట్టాలతో చిరకాల స్వప్నం నెరవేరింది.

Advertisement

Next Story