మొదటి కర్వా చౌత్ ఆ ప్లేస్‌లో జరుపుకున్న మెగా కోడలు.. వైరల్ అవుతున్న పోస్ట్

by Hamsa |
మొదటి కర్వా చౌత్ ఆ ప్లేస్‌లో జరుపుకున్న మెగా కోడలు.. వైరల్ అవుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi), వరుణ్ తేజ్(Varun Tej) గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి వరుణ్ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. కానీ లావణ్య(Lavanya Tripathi) మాత్రం పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. ఇటీవల ఈ అమ్మడు ఓ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత నుంచి సినిమాల్లో కనిపించడం లేదు. నిత్యం తన భర్తతో వెకేషన్స్‌కు వెళ్తూ ఫొటోలు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తుంది. అంతేకాకుండా పలు విషయాలపై రియాక్ట్ అవుతుంది.

తాజాగా, వరుణ్ తేజ్, లావణ్య(Lavanya Tripathi) ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ ట్రిప్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో.. లావణ్య(Lavanya Tripathi) ‘‘కర్వా చౌత్ రోజు చంద్రుడు నా వైపే ఉన్నాడు’’ అనే క్యాప్షన్ ఇచ్చి పలు ఫొటోలు షేర్ చేసింది. స్విట్జర్లాండ్‌(Switzerland)లో జర్మట్ (Zermatt)అనే నగరంలో మంచుకొండల్లో స్కేటింగ్ చేస్తూ వీరిద్దరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే లావణ్య అక్కడే తన మొదటి కర్వా చౌత్ జరుపుకున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అవి చూసిన వారు క్యూట్ కపుల్ అని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed