- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేతికందిన పంట నీట మునిగే.. కారణం ఆ ప్రాజెక్టేనా..?
దిశ, కోటపల్లి: ప్రాణహిత నది ఒడ్డున ఉన్నటువంటి రపాన్ పల్లి, లక్ష్మీపూర్ గ్రామల శివారులో పంట పొలాలు పెసర, మినుములు, జొన్న, పంటలు మేడిగడ్డ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఎక్కువ కావడం వల్ల పూర్తిగా నీట మునిగాయి. లక్ష్మీపూర్, రపాన్ పల్లి.. ప్రాణహిత నది పరివాహక గ్రామాలు కావడంతో ఎగువన ఉన్న మేడిగడ్డ ప్రాజెక్టు గేట్లు మూసి వేయగా పరివాహక ప్రాంతాల్లో ఉన్న గోదావరి బ్యాక్ వాటర్ ను, ప్రాణహిత బ్యాక్ వాటర్ అడ్డుకోవడంతో నీటి ప్రవాహం బాగా పెరిగి సమీప గ్రామ శివారులో ఉన్న పంట పొలాలను.. నీరు పూర్తిగా ముంచేసింది. ఎన్నో ఏళ్లుగా పంటను సాగు చేసుకుంటున్న తమ పంట వర్షాకాలంలో తప్ప ఎప్పుడు మునగ లేదని రైతులు తెలిపారు.
ఈ మెడిగడ్డ ప్రాజెక్టు వల్లనే చేతికందిన పంట లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు న్యాయం చేయాలని, పంట నష్టాన్ని అంచనా వేసి తమకు నష్టపరిహారం అందేలా చూడాలని తెలిపారు. రైతులు ఇచ్చిన సమాచారంతో స్థానిక సర్పంచ్ శంకర్.. అధికారులకు సమాచారం అందించగా, మునిగిన పంట వివరాలను అధికారులు సేకరించి నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.