- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జైలు నుంచి బెయిల్‌పై వచ్చి మూడో పెళ్లి చేసుకున్న నటుడు.. ఫొటోలు వైరల్
దిశ, సినిమా: మలయాళ నటుడు బాల(Balakumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ‘కంగువ’ సినిమా డైరెక్టర్ శివ(Shiva)కు తమ్ముడు అవుతాడని సమాచారం. అయితే ఇటీవల ఆయన భార్య అమృత సురేష్(Amrutha Suresh)తనతో పాటు తన కూతురు అవంతికను వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాల(Balakumar)ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అయితే అరెస్ట్ అయిన 24 గంటల్లోనే బెయిల్‌పై బయటకు వచ్చాడు. తాజాగా, బాల మూడో పెళ్లి చేసుకుని అందరినీ షాక్‌కు గురి చేశాడు. తమిళనాడుకు చెందిన తన బంధువు కోకిల(Kokila)తో ఏడు అడుగులు వేసి బాల కేరళలోని కల్లూరు పావకులం ఆలయానికి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
కాగా, బాల 2010లో అమృత సురేష్(Amrutha Suresh)ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. కానీ కొద్ది కాలానికి మనస్పర్థలు రావడంతో 2019లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత 2021లో ఎలిజబెత్ ఉదయన్‌ను బాల రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లకే 2023లో విడాకులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బాల మొదటి భార్య తాను విడాకులు తీసుకున్నప్పటికీ వేధిస్తున్నాడు ఫిర్యాదు చేయడంతో వీరి వ్యవహారం గత కొద్ది రోజుల నుంచి నెట్టింట వైరల్‌గా మారింది.