- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది అత్యాచారం కాదు.. హైకోర్టు కీలక తీర్పు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం అమ్మాయిలు, అబ్బాయిలు లైంగికంగా కలవడం కామన్ అయిపోయింది. ఆ తర్వాత పెళ్లి వరకూ రాగానే ఏదో ఒక కారణం చెప్పి వదిలించుకోవడం లాంటివి నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే, ఇలాంటి వాటిపై కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
ఇటీవల నవనీత్ నాథ్ అనే కేరళ హైకోర్టు న్యాయవాది తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఆ తర్వాత మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని ఆరోపిస్తూ కేరళ హైకోర్టుకే చెందిన ఓ మహిళా న్యాయవాది అతనిపై కేసు పెట్టింది. ఈ కేసులో అరెస్టైన నవనీత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, దీనిపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పరస్పర అంగీకారంతో లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తే దాన్ని అత్యాచారంగా పరిగనించలేమని నాయస్థానం పేర్కొంది. పరస్పర అంగీకారం లేకుండా లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు లేదా బలవంతంగా, మోసపూరితంగా లైంగిక చర్యకు ఒప్పించేలా చేసినప్పుడు మాత్రమే అది అత్యాచారంగా పరిగణించబడుతుందని కేరళ హైకోర్టు తెలిపింది.