- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకే వేదికపై వైభవంగా పది జంటల పెళ్లి
దిశ, గోదావరిఖని టౌన్: ఆసరా ఫౌండేషన్ గోదావరిఖని ఆధ్వర్యంలో 37వ డివిజన్ కార్పొరేటర్, సామాజిక కార్యకర్త డాక్టర్ రాజేష్ చేతుల మీదుగా స్థానిక కోదండ రామాలయంలో నిరుపేద కుటుంబాలకు చెందిన పదిమంది జంటలకు సామూహిక వివాహాలు వైభవంగా గురువారం నిర్వహించారు. గత ఆరేళ్ల నుంచి గోదావరిఖని పరిసర ప్రాంత నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు ఒక మేనమామగా, తండ్రిలాగా, అన్నలాగా అన్నీ తానై పెంట రాజేష్ వివాహాలను జరిపించి వారి జీవితాలలో వెలుగు నింపుతున్నారు. తల్లి తండ్రి లేని ఆడపిల్లలకు పెంట రాజేష్ దంపతులు స్వయంగా వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం గమనార్హం. వివాహం చేసుకునే జంటలకు బంగారు పుస్తెలు కాళ్ల మట్టెలు నూతన వస్త్రాలు, పెళ్లి సామాగ్రి ఉచితంగా అందించి వైభవంగా వివాహాలు జరిపించి, వివాహానంతరం బంధువులు, అతిథులకు భోజనాలు ఏర్పాటు చేశారు. రామగుండం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుగంటి చందర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. పెంట రాజేష్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. వివాహ అనంతరం నూతన వధూవరులను కోదండ రామాలయం నుండి గోదావరిఖని చౌరస్తా వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి అప్పగింతలు చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బండి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక రావు, ఆలయ కమిటీ చైర్మన్ బెల్లంకొండ రవీందర్ రావు, నగర కార్పొరేటర్లు టీఆర్ఎస్ నాయకులు చల్ల రవీందర్ రెడ్డి, కౌటంబాబు, సినీ నటి హంస, ఆసరా ఫౌండేషన్ సభ్యులు నూనె శరత్ మోహన్, సాంబశివరాజు, ఉరకొండ రమేష్, బండారి రవి, విజయ్ రాం, శ్రీకాంత్, మూల శ్రీధర్‌లు పాల్గొన్నారు.