విదేశీ గడ్డపై భారత్‌కు ప్రాక్టీస్ మ్యాచులు

by Manoj |
విదేశీ గడ్డపై భారత్‌కు ప్రాక్టీస్ మ్యాచులు
X

న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 పూర్తయ్యాక రాబోయే జూలై నెలలో టీమిండియా పురుషుల జట్టు ఇంగ్లాండ్‌లో జరిగే కంట్రీ క్లబ్ వార్మప్ మ్యాచులకు హాజరుకానుంది. రెండు టీ20 మ్యాచులకు డెర్భీ , నార్తాంప్టన్లు వేదికలు కానున్నాయి. జూలై 1న టీమిండియా కంట్రీ గ్రౌండ్‌లో డెర్భీషైర్‌తో తొలి టీ20 ఆడనుంది. ఆ తర్వాత జూలై 3న నార్తాంప్టన్ షైర్‌‌తో జూన్ -3వ తేదిన రెండో టీ20 ఆడనుంది.

అయితే, గతేడాది ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లిన భారత్ అక్కడ ఐదు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. కొవిడ్ కారణంగా నాలుగో టెస్టు అకారణంగా రద్దవ్వగా.. ఇండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఐదో టెస్టును మాత్రం రాబోయే జూలై 1 నుంచి 5 వరకు నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు యోచిస్తున్నాయి. అయితే, అదే సమయంలో కంట్రీ క్లబ్ తరఫున రెండు టీ20లు క్లాష్ అవుతున్నాయి. దీంతో ఐదో టెస్టు పోస్టుపోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా, ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా భారత్ మొత్తం 3 టీ20లు, మూడు వన్డేలను ఆడాల్సి ఉంది. తొలి టీ20 సౌతాంప్టన్ వేదికగా జూలై 7 ప్రారంభం కానుండగా మిగతా రెండు మ్యాచులు ఎడ్జిబ్యాస్టన్, ట్రెంట్ బ్రిడ్జి వేదికగా జరగనున్నాయి.

Advertisement

Next Story