- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అగ్గిరాజేసిన టీవీ చర్చా వేదిక.. వైసీపీ నేతపై గ్రీష్మా ప్రసాద్ ఆగ్రహం
దిశ, ఏపీ బ్యూరో: నవరత్నాల అమలు కమిటీకి వైస్ చైర్మన్, వైసీపీ నేత నారాయణ మూర్తిపై టీడీపీ మహిళా నేత కావలి గ్రీష్మా ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూమ్ ద్వారా శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. 'టీడీపీ ఆడవాళ్లను తిడితే జగన్మోహన్ రెడ్డి తమకు పదవులిస్తాడని, ఒళ్లు కొవ్వెక్కి కొట్టుకుంటున్న వైసీపీ వెధవలంతా కూడా.. మహిళలకే పుట్టామనే నిజాన్ని గుర్తుంచుకుని మసులుకుంటే మంచిది.
అధికారమనే అహంకారంతో విర్రవీగితే ఆడవాళ్ళ చేతిలో చెప్పుదెబ్బలు, చీపురు సత్కారాలే మిగులుతాయి' అని హెచ్చరించారు. వైసీపీ నేత నారాయణ మూర్తి ఒక టీవీ చర్చావేదికలో తనను అనరాని మాటలు అని శునకానందం పొందాడని ఆవేదన వ్యక్తం చేశారు.
దళిత మహిళను, గొప్ప కుటుంబం నుంచి వచ్చినదాన్ననే ఆలోచన కూడా లేకుండా హద్దులమీరి మాట్లాడాడు. అలాంటి వెధవల్ని పెంచి పోషిస్తున్న జగన్మోహన్ రెడ్డి మహిళలను ఉద్ధరిస్తున్నానంటూ కలరింగ్ ఇస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పక్షాన రాష్ట్రంలో ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయంపై నాలాంటి వారు మాట్లాడకూడదా? మహిళల మానప్రాణాలు కాపాడలేని ముఖ్యమంత్రి, హోంమంత్రి, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకన్నా పెద్ద మెంటల్ గాళ్లు ఎవరూ ఉండరు అంటూ కావలి గ్రీష్మా ప్రసాద్ ధ్వజమెత్తారు. నారాయణమూర్తిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని గ్రీష్మా ప్రసాద్ హెచ్చరించారు.
టీవీ చర్చల్లో పశుత్వాన్ని ప్రదర్శించాడు..
'ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెప్పు కోసం ప్రయత్నించే వైసీపీ నేతలు అందుకు వేరే మార్గాలు ఎంచుకోవాలి. అంతేకానీ ఎదుటివారిని, ప్రతిపక్ష పార్టీల తరుపున మాట్లాడే వారిని దూషిస్తూ, శునకానందం పొందడం సరి కాదు. ముఖ్యంగా వైసీపీనేత నారాయణమూర్తి గురువారం సాయంత్రం జరిగిన టీవీ చర్చావేదికలో నన్ను ఉద్దేశించి అనరానిమాటన్నాడు.
రాష్ట్రంలో మహిళలు, మరీ ముఖ్యంగా అభంశుభం తెలియని చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి నేను మాట్లాడుతుంటే సదరు బుద్ధిలేని నారాయణమూర్తి నన్ను ఉద్దేశించి, ఎందుకంతలా రెచ్చిపోతున్నావు.. నిన్నుఎవరైనా రేప్ చేశారా అని అనడం అతనిలోని పైశాచికత్వానికి, క్రూరత్వానికి నిదర్శనం' అని టీడీపీ మహిళా నేత గ్రీష్మా ప్రసాద్ అన్నారు.
జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య మా తాత. ఆయన దళితుల సంక్షేమం కోసం ఎంతగానో పోరాడారు. అలానే నాతల్లి కావలి ప్రతిభాభారతి ఏపీ అసెంబ్లీకి తొలి మహిళాస్పీకర్‌గా వ్యవహరాంచారు. అలాంటి గొప్పవారి అడుగుజాడల్లో నడిచి, మహిళలకు న్యాయం చేస్తూ, వారికి అన్ని విధాలా అండగా ఉంటున్న టీడీపీ నాయకత్వం లో పనిచేస్తున్న నన్ను పట్టుకొని ఒక ఉన్మాద పార్టీకి చెందిన ఉన్మాది నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ఆడపిల్లను అనకూడదనే ఇంగితం కూడా లేకుండా నారాయణమూర్తి తనలోని పశుత్వాన్ని టీవీ చర్చలో ప్రదర్శించాడు.
మానభంగం జరిగితేనే మానభంగానికి గురైన వాళ్ల గురించి మాట్లాడాలా అని చేతగాని, దద్దమ్మలైన వైసీపీ వాళ్లను ప్రశ్నిస్తున్నాను. విపక్షాలకు చెందిన ఆడవాళ్లను పదవుల కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న వైసీపీ నేతలకు, బురదలో పోర్లే పందులకు పెద్దగా తేడా లేదనే చెప్పాలి. మిస్టర్ నారాయణమూర్తి నిన్నెవరు రేప్ చేశార్రా వెధవా.. రేప్‌కు గురయ్యే ఇలా బరితెగించి మాట్లాడావా? అరేయ్ వెధవా.. నారా యణమూర్తి నువ్వు అన్నది నన్నుకాదు.. యావత్ మహిళా జాతిని.. ఒక దళిత మహిళను అన్నావు.
నిజంగా జగన్మోహన్ రెడ్డి కి, అతని పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నారాయణ మూర్తి లాంటి పోరంబోకులు రోడ్లపైకి వస్తే ఆడ బిడ్డలు, యువతులు చెప్పులు, చీపుర్లతో చావగొట్టడానికి రెడీగా ఉన్నారు. నాకు జరిగిన అవమానంపై న్యాయం జరిగే వరకు వైసీపీని, ఆ పార్టీ నేత నారాయణమూర్తి ని వదిలేది లేదని కావలి గ్రీష్మా ప్రసాద్ హెచ్చరించారు.