'అప్పు ఎవడమ్మ మొగుడు కట్టి వెళ్తాడు?' .. వైసీపీపై టీడీపీ సీనియర్ నేత సీరియస్

by Javid Pasha |
అప్పు ఎవడమ్మ మొగుడు కట్టి వెళ్తాడు? .. వైసీపీపై టీడీపీ సీనియర్ నేత సీరియస్
X

దిశ, ఏపీ బ్యూరో: అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 6 లక్షల కోట్లు అప్పు చేశావు, ఈ రెండేళ్ళలో ఇంకో 4 లక్షల కోట్ల అప్పు చేస్తావు అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. శనివారం ఆయన ట్వీట్టర్‌‌లో జగన్‌‌‌పై, అతని ప్రభుత్వంపై వరుస ట్వీట్‌‌లతో విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పు ఎవడమ్మ మొగుడు కట్టి వెళ్తాడు? అని ప్రశ్నించారు. ఇవి అప్పులు కావా?అని నిలదీశారు. ఇంత భారం నువ్వు 2024లో వచ్చే ప్రభుత్వంపై వెయ్యట్లేదా? అని ఎద్దేవ చేశారు. 'ఇవి అప్పులు కాకపోతే నీ సొమ్మా నీ బాబుగారి సొమ్మా? జగన్' అంటు మండిపడ్డారు. 'మీ వెంట్రుకలతో మాకు పని లేదు కానీ, మీ పార్టీ నాయకుల కామానికి కళ్ళెం వేయకపోతే ఆడ కూతుర్లు నడిరోడ్డు మీద గుడ్డలు ఊడదీసి కొడతారు. బ్రోకర్ సాయిరెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ కూడా చదవలేని మీ నత్తి పకోడికి నీ సూక్తులు చెప్పుకో' అని ఎద్దేవా చేశారు. విశ్వవిద్యాలయాల్లో కార్యకర్తలకు జాబ్ మేళాలు నిర్వహిస్తామని ప్రకటించిన మిమ్మల్ని చూసి, నత్తి పకోడీ, జూమాంజి అంటూ అందరూ డ్యాష్‌తో నవ్వుతున్నారని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed