- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ పాలనపై టీడీపీ అచ్చెన్నాయుడు కామెంట్స్
దిశ, ఏపీ బ్యూరో: నేతి బీరలో నెయ్యి ఉన్న చందంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో సామాజిక న్యాయం ఉందని టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆదివారం మాట్లాడుతూ, సామాజిక అన్యాయం తప్ప.. సామాజిక న్యాయం తెలియని వ్యక్తి జగన్ అని అన్నారు. సొంత సామాజిక వర్గానికి న్యాయం చేయటం పై చూపిన శ్రద్ధ.. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిపై ఏనాడు చూపించలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టడమేనా మీరు చేసిన సామాజిక న్యాయం అని నిలదీశారు. చిత్తూరు జిల్లాలో దళిత వర్గానికి చెందిన నారాయణ స్వామి కి మంత్రి పదవి ఇవ్వకుండా.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో అవమానించి, ఆయనను కన్నీటి పర్యంతం చేశారని మండిపడ్డారు.
బీసీలు ఛైర్మన్లుగా నియమించిన తిరుపతి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహా ఇతర మున్సిపాలిటీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లన్నింటికీ సొంత సామాజిక వర్గాన్ని షాడోలుగా నియమించటమే సామాజిక న్యాయమా అని ప్రశ్నించారు. సామాజిక న్యాయంపై సీఎం జగన్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. వైసీపీ మూడేళ్ల పాలనలో బడుగు, బలహీన వర్గాల జీవితాలు ఎంతమేర బాగుపడ్డాయో చెప్పే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని అన్నారు. బడుగు, బలహీన వర్గాల విషయంలో ఎన్నిరకాల కుప్పిగంతులు వేసినా, తిమ్మిని బమ్మిని చేసేలా ప్రచారం హోరెత్తించినా.. వచ్చే ఎన్నికల్లో ఆయా వర్గాల ప్రజలు కర్ర కాల్చి జగన్ రెడ్డికి వాతలు పెట్టడం తథ్యమని అచ్చెన్న జోస్యం చెప్పారు.