అతను చేసింది మోసమే.. రాజవర్ధన్‌పై కఠిన చర్యలు తీసుకోండి

by Disha News Desk |
అతను చేసింది మోసమే.. రాజవర్ధన్‌పై కఠిన చర్యలు తీసుకోండి
X

ముంబై : యువ క్రికెటర్ రాజవర్ధన్ హంగర్గేకర్‌కు ఉచ్చు బిగుస్తోంది. వయస్సుకు సంబంధించి తప్పుడు ధృవపత్రాలు సమర్పించి అండర్-19 వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకున్న యువ ఆటగాడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహారాష్ట్ర స్పోర్ట్స్ కమిషనర్ ఓం ప్రకాష్ బకోరియా బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఫిబ్రవరి -8 తేదీన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెక్రటరీ జై షాకు రాసిన లేఖలో ఇలా ఉంది.

రాజ వర్ధన్ తన పుట్టినరోజును 10 జనవరి 2001 నుంచి 10 నవంబర్ 2002కు మార్చుకున్నారని, అందుకోసం పాఠశాల మేనేజ్మెంట్ సాయం తీసుకున్నాడని బకోరియా వెల్లడించాడు. అండర్ -19 వరల్డ్ కప్‌లో టీమిండియా టైటిల్ నెగ్గాక.. రాజవర్ధన్‌ను సీఎస్కే జట్టు రూ.1.5 కోట్లుకు వేలం పాటలో దక్కించుకున్నదని వివరించాడు. ఇటువంటి చీటింగ్ ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా యువ క్రికెటర్ పై కఠిన చర్యలకు ఆదేశించాలని బకోరియా బీసీసీఐను కోరాడు.

Advertisement

Next Story

Most Viewed