- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్ హయాంలో చెరువులను అభివృద్ధి చేశాం : ఎమ్మెల్యే
దిశ, మీర్ పేట్: గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మహేశ్వరం నియోజకవర్గంలో చెరువులు అభివృద్ధి చేసుకున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం కార్పొరేషన్ పరిధిలోని 11 వ డివిజన్ పెద్ద చెరువు కట్టకు ఫెన్సింగ్, క్రీడా ప్రాంగణం, అభివృద్ధి పనులకు రూ .1 కోటి 80 లక్షల నిధులతో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే సబిత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులు మధ్యలోనే ఆగిపోయాయని దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సగంలో ఆగిపోయిన పనులను పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. శంకుస్థాపన చేసిన చెరువు ఫెన్సింగ్ క్రీడా ప్రాంగణం అభివృద్ధి పనులు నెల రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జ్ఞానేశ్వర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆర్కాలకామేష్ రెడ్డి, కార్పొరేటర్లు ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ధనలక్ష్మి రాజ్ కుమార్, బిక్షపతి చారి, లావణ్య బీరప్ప, కో ఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.